business ideas in telugu guide

best business ideas in Telugu. you can do these businesses in villages and towns. నేను చెప్పిన ఈ బిజినెస్ లను పట్టణాలలో మరియు పల్లెటూర్లలో చేసుకోవచ్చు. money earning ideas in Telugu

business ideas in telugu


ప్రతి ఒక్కరికి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఒక ఐడియా ఉంటుంది. కానీ ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలో, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాదు  అందుకే అందుకే వ్యాపారం చేయాలన్న ఆలోచనను వదిలేస్తారు. సాధారణంగా మీరు గూగుల్ లో బిజినెస్ గురించి వెతికితే చాలా బిజినెస్ ఐడియాలు వస్తాయి, కానీ అందులో  ఏ ఒక్కదాన్ని కూడా ఇండియాలోనూ, మన తెలుగు రాష్ట్రాల్లో ను,  ఆ వ్యాపారాలను స్టార్ట్ చేయలేము.  ఎందుకంటే ఆ articles అన్ని ఎలాంటి అనుభవం లేని (freelancers)  వాళ్లు రాస్తారు కాబట్టి.

నేను మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న కొన్ని వ్యాపారాలను చాలా రోజుల నుండి గమనిస్తున్నాను. నేను ఈ ఆర్టికల్ లో మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చేయగలిగే  సులువైన వ్యాపారాల గురించి చెబుతాను. ప్రతి విభాగానికి ఎంతోకొంత  పెట్టుబడి అయితే పెట్టాల్సి ఉంటుంది.  నేను చెప్పబోయే ప్రతి వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవసరం మరియు దానికి ఏ వస్తువులు కావాలో కూడా చెబుతాను.

1. digital marketing

digital marketing అంటే ఏదయినా ప్రోడక్ట్ ను లేదా సర్వీస్ ను ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేయడం. డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలా పెద్ద subject మరియు లీడింగ్ బిజినెస్. ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ కి చాలా value ఉంది, future లో కూడా ఉంటుంది. మీరు ఒక వెబ్సైటు create చేసుకొని కూడా డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు లేదా వేరే వాళ్ళ వెబ్సైట్ కి ఆర్టికల్స్ రాయడం లేదా వాళ్ళ వెబ్సైట్ కి seo చేయడం లాంటివి చేయొచ్చు. ఆలా చేయడం ద్వారా వాళ్ళు మనకి మనీ ఇస్తారు. ఇలా వేరే వాళ్ళ కోసం పని చేయడాన్ని freelancing అంటారు. 

మీరు freelancing చేయాలంటే కొంచెం ట్రైనింగ్ తీసుకోవాలి. లేదా మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా చేయొచ్చు. దీనికి కూడా మీరు ట్రైనింగ్ తీసుకోవలసి ఉంటుంది. మీరు డిజిటల్ మార్కెటింగ్ ని కెరీర్ గా తీసుకోవచ్చు, కానీ మీరు సక్సెస్ అవ్వాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ ని స్టార్ట్ చేస్తే బెటర్.  మీరు డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా parttime లాగా కూడా స్టార్ట్ చేయొచ్చు.

పెట్టుబడి 

డిజిటల్ మార్కెటింగ్ కి పెట్టుబడి ఎక్కువగా అవసరం లేదు(low investment) మీరు మీ ఫోన్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. లాప్టాప్ లేదా కంప్యూటర్ ఉంటె ఇంకా బెటర్. 

నా సలహా

నేను చేప్పాను కదా అని డిజిటల్ మార్కెటింగ్ లోకి రాకండి. మీకు దీనిమీద passion ఉంటేనే రండి. మీరు ఈ feild లో సక్సెస్ అవ్వ్వాలంటే 3-4 years పడుతుంది. అన్ని ముందే చూసుకొని రండి. నేను త్వరలో డిజిటల్ మార్కెటింగ్ గురించి వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను మిస్ అవ్వొద్దు అనుకుంటే telugu tech with aravind ఛానల్ని సబ్స్క్రయిబ్ చేసుకోండి.


2. బట్టలు కుట్టడం మరియు ఆన్లైన్ లో అమ్మడం


small business ideas for ladies in telugu. ఈ వ్యాపారం ముఖ్యంగా housewifes కు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈమధ్య ఆడవాళ్లు ఎక్కువగా బట్టలు కుట్టడం నేర్చుకుంటున్నారు. housewifes కాకుండా ఇప్పుడు బట్టలు కుట్టడం ప్రొఫెషన్ గా తీసుకున్న మొగవాళ్లు కూడా ఈ  బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ కి ఇష్టపడుతున్నారు.  ఈ టైంలో మీరు మంచి బట్టలు కుట్టే ఆన్లైన్ లో అమ్మితే  మీకు మంచి ఇన్కమ్ వస్తుంది.  మీరు ఆన్లైన్లో shirts మీద దృష్టి పెట్టడం మంచిది.

ఒకవేళ మీరు మంచి sewing machine కొనాలి అనుకుంటే ఈ link క్లిక్ చేయండి.

 మీరు ఈ బిజినెస్ లొ సక్సెస్ అవ్వాలంటే నేటి యువతకు నచ్చేవిధంగా బట్టలు కుట్టాలి. మీరు కుట్టిన బట్టలను అమెజాన్ లేదా flipkart లో అమ్ముకోవచ్చు లేదా మీరు బయట షాప్ లలో కూడా  అమ్ముకోవచ్చు. flipkart లేదా amazon ఏమైనా products అమ్మాలి అంటే మీకు seller అకౌంట్ కావాలి . ఆ అకౌంట్ ఎలా create చేయాలో ఈ వీడియోలో చెప్పాను. 

పెట్టుబడి

దీనికి పెద్దగా పెట్టుబడి ఎం అవసరం లేదు. దీనికి మీరు ఒక sewing మిషన్ మరియు clothes అవసరం ఉంటుంది అంతే. ఒకవేళ మీరు మంచి sewing మెషిన్ కొనాలి అనుకుంటే ఈ  మెషిన్ ను ఒకసారి చూడండి.

పెట్టుబడి అంచనా: 15,000

నా సలహా


1. ఆన్లైన్ లో మీరు ఒక్కరే ఈ business స్టార్ట్ చేయకుండా ఒక 4 లేదా 5 గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి ఫలితం దక్కుతుంది.

2. మీ బట్టలు కుట్టే skills improve  చేసుకోండి.  దాని కోసం ఆన్లైన్లో చాలా course  లు ఉంటాయి.

3. poultry farming and rearing animals

business ideas in villages in telugu. మన ఇండియాలో చాలా మంది చేస్తున్నsmall business. కానీ ఎక్కువ మంది broiler కోళ్ళను మాత్రమే పెంచుతున్నారు. మీరు broiler కోళ్లను కాకుండా నాటు కోళ్లను పెంచితే చాలా మంచి లాభం ఉటుంది. broiler చికెన్ కంటే నాటు కోళ్ల మాంసం ధర ఎక్కువగా ఉంటుంది. పైగా నాటు కోళ్ల కోసం ఇప్పుడు ఎక్కడ చుసిన దొరకడం లేదు. మీరు పెంచిన కోళ్లను చికెన్ సెంటర్ లలో అమ్మొచ్చు లేదా మిరే ఒక చికెన్ సెంటర్ పెట్టొచ్చు. 


ఒకవేళ మీకు నాటు కోళ్లు పెంచడం ఇష్టం లేకపోతే కుందేళ్లు లేదా ఇంకా వేరే రకమైన వాటిని కూడా పెంచొచ్చు కూడా పెంచొచ్చు. కుందేళ్ళకు వేరే జంతువులతో పోలిస్తే చాలా తక్కువ పెట్టుబడి అవసరం అవుతుంది. మీరు ఒక రెండు మూడు జతలతో కూడా వ్యాపారం మొదలు పెట్టొచ్చు. పైగా కుందేళ్లు నెలకు ఒకసారి పిల్లలను కంటాయి కాబట్టి చాలా త్వరగా మీరు సక్సెస్ అవుతారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.

పెట్టుబడి

ఈ poultry farming కి కొంచెం పెట్టుబడి ఎక్కువగానే ఉంటుంది. అది మీరు ఉండే ఏరియా బట్టి ఉంటుంది పల్లెటూర్లలో తక్కువ పెట్టుబడి అవుతింది, పట్టణాలలో ఎక్కువ పెట్టుబడి అవుతుంది.

నా సలహా

నేను నాటు కోళ్లు మరియు కుందేళ్లు ఉదాహరణ కోసం మాత్రమే చెప్పాను. చేపలు, టర్కీ కోళ్లు, ఇలాంటివి చాలానే ఉన్నాయి మీరు ఈ  బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి అన్నింటి గురించి తెలుసుకొని మీ ఏరియా లో ఏ business పెడితే బాగుంటుందో ఒకసారి ఆలోచించుకోండి. 


4. Event management

Event planning అంటే పండుగలు, సమావేశాలు ,వేడుకలు, వివాహాలు జరిపించడం. example decoration చేయడం, బడ్జెట్ చూసుకోవడం, కేటరింగ్, ఎంటర్టైన్మెంట్, సెక్యూరిటీ మరియు ఈవెంట్ కి కావలసిన పర్మిషన్ తీసుకోవడం లాంటి వాటిని ఈవెంట్ management అంటారు. ఈ బిజినెస్ లో ఆర్డర్స్ సంపాదించడం కొంచెం కష్టమే. ఈ బిజినెస్ ని మీరు పల్లెటూర్లలో, పట్టణాలలో ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. పల్లెటూర్లలో ఈ బిజినెస్ ని tenthouse అని పిలుస్తారు. 

పెట్టుబడి

మీరు ఈ బిజినెస్ ని పల్లెటూర్లలో స్టార్ట్ చేస్తే low investment, తక్కువ ఇన్కమ్ ఉంటుంది. అదే మీరు పట్టణాలలో స్టార్ట్ చేస్తే ఎక్కువ పెట్టుబడి, ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. 

నా సలహా 

  1. మీరు ఈ బిజినెస్ నీ డైరెక్ట్గ గా స్టార్ట్ చేయకండి కొన్నిరోజులు ఈ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర పనిచేయండి. ఇలా అయితే మీకు experience వస్తుంది కాబట్టి మీకు సక్సెస్ rate ఎక్కువగా ఉంటుంది. 
  2. మీకు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే ఆర్డర్స్ రావు కాబట్టి ముందు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్టు మీ ఫ్రెండ్స్ కు మరియు మీ ఫామిలీ కి చెప్పండి ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ పెళ్లిళ్లు ఫంక్షన్స్ ఏమైనా ఉంటె మీకు చెప్తారు. 

5. Photography


Photography అంటే  ఫోటోలు తీయడం అని మీకు అందరికి తెలిసిందే. కానీ మీకు తెలియనివి కూడా ఫోటోగ్రఫీ లో చాలా ఉన్నాయి. మీరు ఒక మంచి కెమెరా కొని  ఏవైనా  పెళ్లిళ్లకు ఫంక్షన్లకు  ఫొటోలు తీయొచ్చు. లేదా మీరు  మీ కెమెరాను rent కి కూడా ఇవ్వచ్చు.  దీనికి  మీకు కావాల్సింది మంచి  ఫోటోగ్రఫీ స్కిల్స్.  మీరు మంచి మంచి ఫోటోలు తీసి ఆన్లైన్లో ఆన్లైన్లో కూడా  అమ్మవచ్చు. 

 మీరు తీసిన ఫోటోలు ఆన్లైన్లో అమ్మడానికి చాలా వెబ్ సైట్స్ ఉన్నాయి.  అందులో ఒక వెబ్ సైట్ shutterstock. ఇలా మీరు ఫోటోలు ఆన్లైన్లో అమ్మడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు.  మీ అమ్మిన ఫోటోలను పెద్ద పెద్ద వెబ్సైట్ వాళ్ళు కొంటారు కాబట్టి మీకు మంచి డబ్బులు వస్తాయి.పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు ఫోటోలు తీయడం ద్వారా కూడా మంచి ఇన్కమ్ వస్తుంది. self employment కి Photography మంచి అలొచన.

పెట్టుబడి 


ఈ ఫొటోగ్రఫీ బిజినెస్ కి పెట్టుబడిగా కెమెరా మాత్రమే అవసరం ఉంటుంది (low investment). నేను ఇక్కడ కింద రెండు మంచి కెమెరాల లింక్ ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు.

Canon EOS 200D II
Nikon D5600

  ఒకవేళ మీరు పెళ్లిళ్లకు ఫంక్షన్లకు ఫోటోలు తీయాలంటే ప్రొఫెషనల్ కెమెరా కొనాల్సి ఉంటుంది.  దాని లింకు కూడా కింద ఇచ్చాను. 

Canon EOS 5D Mark IV 30.4 MP Digital SLR Camera
Sony A7R Mark III

నా సలహా

మీరు ఆన్లైన్ లో ఫోటోలు అమ్మాలంటే చాలా మంచి ఫోటోలు తీయాలి.  మీకు ఫోటోగ్రఫీ పై ఇంట్రెస్ట్ ఉంటే నే ఫోటోగ్రఫీ  ఫీల్డ్ లోకి రండి.


6. యూట్యూబ్

యూట్యూబ్ గురించి మీకు అందరికి తెలిసిందే. మనం పొద్దున లేచినప్పటి నుంచి యూట్యూబ్ ని వాడుతుంటాం.  దీని నుంచి డబ్బులు వస్తాయి అని కూడా అందరికి తెలిసిందే.  గడచిన సంవత్సరం నుంచి యూట్యూబ్ ఛానల్లు  చాలా పెరిగిపోయాయి.  యూట్యూబ్ లో డబ్బులు వస్తాయి  అనే కారణంతో  అందరూ తమ సొంత చానల్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఫ్యాషన్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తేనే సక్సెస్ అవుతారు.


మీకు ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉంటే నే యూట్యూబ్ channel స్టార్ట్ చేయండి. అలా అయితేనే మీకు మంచి పేరుతో పాటు, మంచి ఇన్కమ్ వస్తుంది.  యూట్యూబ్ ఛానల్ కి  ఏ పెట్టుబడి అవసరం లేదు. మీకు ఫోన్ ఉంటే ఫోన్ తో లేదా కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ తో  కూడా యూట్యూబ్ channel స్టార్ట్ చేయొచ్చు.

7. Home foods

business ideas in villages in telugu. హోమ్ ఫుడ్స్ అంటే మీ ఇంట్లోనే కొన్ని రకాల ఐటమ్స్ తయారు చేసి బయట అమ్మడం. పెళ్లిళ్లకు ఏదైనా ఫంక్షన్లకు చాలా పెద్ద orders వస్తాయి.  ఎక్కువగా స్వీట్స్ మరియు స్నాక్స్ order  చేస్తారు. ఈ బిజినెస్  housewifes స్టార్ట్ చేస్తే  చాలా బెటర్.  ఒక పది, పదిహేను మంది కలిసి ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే  మీకు ఈజీగా ఉంటుంది. ఈ బిజినెస్ కు పెట్టుబడి కూడా చాలా తక్కువ కానీ festive సీజన్లో చాలా లాభం వస్తుంది.

Leave a Comment