మన ప్రతి ఒక్కరు, ఏదో ఒక రోజు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది ఆర్థికంగా స్థిరపడటానికి, వాళ్ళ passion నీ కొనసాగించడానికి మరియు డబ్బు సంపాదించడానికి ఇలాంటి వాటి కోసం వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీలలో చిన్న వ్యాపారాలే చాలావరకు ఉన్నాయని మీకు తెలుసా?
సురక్షితమైన ఉద్యోగాన్ని వదిలి వ్యాపారాన్ని ప్రారంభించడం అంటే చాలా కష్టం. చాలా startup లు కేవలం ఒకటి లేదా రెండు సంవత్సరాలు మాత్రమే మనుగడ సాగిస్తాయి మరియు ఐదేళ్ళలోపు వారి startup ను వదిలేస్తారు. మీ పరిశ్రమతో సంబంధం లేకుండా విజయవంతమైన వ్యాపార కార్యక్రమానికి బలమైన పునాది ముఖ్యమైనది.
మీ వ్యాపారాన్ని మీరు విజయవంతంగా ప్రారంభించడంలో మీకు ఉపయోగపడే టిప్స్
1. వ్యాపారాన్ని నిర్ణయించుకోండి
ఈ ప్రపంచంలో చాలా వ్యాపారాలు ఉన్నాయి. అందుకే మీరు ఏ వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా నిర్ణయించుకోండి. మీరు వ్యాపారాన్ని మొదలుపెట్టాలనుకున్నప్పుడు ముందుగా చేయవలసింది మార్కెట్లో competition ఎలా ఉందొ తెలుసుకోవడం. మీరు కొత్తగా బిజినెస్ ని స్టార్ట్ చేసేటప్పుడు ఇది తప్పనిసరి.
మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్న వ్యాపారం గురించి ఆన్లైన్ లో తెలుసుసుకోవచ్చు. మీరు మీ వ్యాపారాన్ని మొదలుపెట్టేముందు ఆ వ్యాపారం గురించి అన్ని తెలుసుసుకోండి.
2. Business plan రెడీ చేసుకోండి
Business plan అంటే వ్యాపారం యొక్క నిర్మాణం, లక్ష్యాలు మరియు వ్యూహాల యొక్క ప్రతి అంశాన్ని వివరించే వృత్తిపరమైన పత్రం. మీరు ఆర్థిక సహాయం కోసం పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకులను సంప్రదించాలని అనుకుంటే ఇది ధ్రువీకరణకు ఈ business plan ఉపయోగపడుతుంది.
business plan యొక్క కొన్ని ప్రాథమిక అంశాలు ఎగ్జిక్యూటివ్, వ్యాపార వివరణ, నిర్మాణం, మార్కెట్ పరిశోధన, పోటీ విశ్లేషణ, నిర్వహణ మరియు సిబ్బంది వివరణ, ఉత్పత్తులు మరియు సేవల జాబితా, మార్కెటింగ్ మరియు అమ్మకాల వ్యూహం మరియు నిధుల ప్రణాళిక.
3. చేస్తున్న ఉద్యోగం వదిలెయ్యకండి
వ్యాపారం చేయాలన్న ఆలోచన మంచిదే కానీ ఉన్నఫలంగా ఉద్యోగం మానేసి వ్యాపారం చేయడం అంటే చాలా ప్రమాదకరం. ఒకవేళ మీకు ఉద్యోగం ద్వారా కాకుండా వేరే వాటి నుండి మీకు సరిపడా డబ్బులు వస్తే ఉద్యోగం మానేయచ్చు. ఉన్నఫలంగా ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తే డబ్బులకోసం చాలా ఇబ్బంది పడాల్సిఉంటుంది. ఎందుకంటే వ్యాపారం విజయవంతం కావడానికి మరియు దాని నుండి డబ్బులు రావడానికి చాలా సమయం సమయం పడుతుంది కాబట్టి.
4. ఒంటరిగా వ్యాపారం చెయ్యకండి
మీకు వ్యాపారం చేసేటప్పుడు ఇంకొకరి అవసరం అయితే ఉంటుంది. అది మిమ్మల్నిసపోర్ట్ చేయడానికి మరియు బిజినెస్ పరంగా సహాయపడటానికి అవసరం అవుతుంది.
5. నిపుణుల సహాయం తీసుకోండి
మీరు చేస్తున్న వ్యాపారంలో నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం. ఇది మీ వ్యాపారానికి అన్నివిధాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు చాల కాలం నుండి వ్యాపారం చేస్తున్నారు కాబట్టి త్వరగా వ్యాపారం సక్సెస్ కావడానికి మరియు ఆ వ్యాపారం గురించి మీకు ఉన్న సందేహాల గురించి తెలుసుకోవచ్చు.
6. మీ వ్యాపారానికి GST తో అనుసంధానం చేయండి.
మీ వ్యాపారానికి GST ని అనుసంధానం చేయకపోతే భవిష్యత్తులో మీ వ్యాపారానికి చట్టపరంగా చాలా సమస్యలు వస్తాయి. అంతే కాకుండా మీరు GST తో అనుసంధానం చేయకపోతే మీరు తయారు చేసిన వస్తువులను బయట మార్కెట్లో అమ్మలేరు